
మద్యం టెండర్లకు ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 30తో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనుండడంతో ప్రభుత్వం మరో రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబరు నుంచి 2027 నవంబరు వరకు) లైసెన్స్‌లు జారీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 23న కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిన వైన్స్‌లు కేటాయించనున్నారు. నోటిఫికేషన్ రాకతో టెండర్‌దారులు సన్నద్ధమవుతున్నారు. గత నెలలో టెండర్ ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
రిజర్వేషన్ల ఆధారంగా దుకాణాల కేటాయింపు
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు కల్పించనుంది. ఇందులో గౌడ్స్‌కు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ నేతృత్వంలో గురువారం సాయంత్రం రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాల నంబర్లను లాటరీ ద్వారా కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీలకు 3 షాపులు, ఎస్సీలకు 10 షాపులు, గౌడ్స్‌కు 27 షాపులు, మిగతా 53 షాపులు ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరి కింద కేటాయించారు.
కేటాయించిన నంబర్లు ఇవే..
రిజర్వేషన్ల ఆధారంగా వైన్స్ నంబర్లు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు షాపు నంబర్లు 34, 85, 2 కేటాయించగా, ఎస్సీలకు 72, 10, 39, 61, 16, 50, 73, 28, 22, 81 కేటాయించారు. అదేవిధంగా గౌడ్స్‌కు 80, 24, 57, 52, 23, 41, 47, 19, 76, 04, 51, 18, 25, 77, 26, 89, 08, 44, 36, 07, 88, 49, 06, 60, 32, 43, 40 కేటాయించారు.
నేటి నుంచి టెండర్ దరఖాస్తుల స్వీకరణ
వైన్ షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు టెండర్‌దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెండర్ వేయదలిచిన వారు రూ.3లక్షల డీడీ తీసి అందుకు సంబంధించిన పత్రాలతో కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దరఖాస్తులు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 23న కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిన వైన్స్‌లు కేటాయించనున్నారు.
ఈసారి ఆరు వైన్స్‌ల తగ్గింపు
జిల్లాలో గత టర్మ్‌లో 99 వైన్స్ షాపులకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. ఈ ఏడాది 93 వైన్స్‌లకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మిగతా ఆరు వైన్స్‌లను తీసేస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. అందులో మఠంపల్లి, పాలకీడు, చింతలపాలెం, మేళ్లచెర్వు, నడిగూడెం, కోదాడ టౌన్‌లోని ఒక వైన్స్‌లకు సేల్స్ లేకపోవడంతో ఈ ఏడాది లైసెన్స్‌లు ఇవ్వడం లేదని ఎకై ్సజ్ అధికారి చెప్పారు.
ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2025–27కు సంబంధించి వైన్ షాప్‌ల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు పారదర్శకంగా కేటాయించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ఉన్న 93 వైన్ షాప్‌లకు సంబంధించి రిజర్వేషన్ కేటాయింపుల కోసం శుక్రవారం జారీ చేయనున్న నోటిఫికేషన్ విషయమై గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా అబ్కారీ అధికారి లక్ష్మణ్ నాయక్, ఎస్టీ వెల్ఫేర్ అధికారి శంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి దయానంద రాణి, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహారావులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీలకు మూడు షాపులు, ఎస్సీలకు పది షాపులు, గౌడ్స్ కు 27 షాపులు, మిగిలిన 53 షాపులు ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరికి కేటాయించినట్లు తెలిపారు. 93 నంబర్లు బాక్స్‌లో వేసి లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు చెప్పారు. షాపుల కేటాయింపు ప్రక్రియ వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అబ్కారీ సీఐలు మల్లయ్య, నాగార్జున రెడ్డి, శంకర్, రజిత పాల్గొన్నారు.
ఫ కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్ విడుదల
ఫ జిల్లాలో 93 వైన్ షాపులు
ఫ రిజర్వేషన్ల ఆధారంగా
ఎస్టీలకు 3, ఎస్సీలకు 10,
గౌడ్స్‌కు 27 దుకాణాలు కేటాయింపు
ఫ నేటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

మద్యం టెండర్లకు ఆహ్వానం