
గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రికి ఘన నివాళి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వారి చిత్రపటాలకు మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కాకాణి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రిటిష్ వలస పాలకుల కంటే దారుణంగా, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, ఉక్కుపాదంతో అణచి వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమయ్యాయని, ప్రభుత్వ పాలన మహనీయుల సిద్ధాంతాలకు విఘాతం కలిగించే విధంగా ఉండటం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాంధీజీ కలలు సాకారం చేసేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.