
మెడికల్ అధికారులకు పదోన్నతులు కల్పించాలి
నెల్లూరు (టౌన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తున్న వైద్యులకు నిర్ణీత కాల వ్యవధిలో పదోన్నతులు కల్పించాలని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యులకు 25 ఏళ్లుగా పదోన్నతులు లేవన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సర్జన్, ఇద్దరు డిప్యూటీ సివిల్ సర్జన్‌ను నియమించాలన్నారు. సర్వీసు పీజీ కోటా 20 శాతం విధానాన్నే కొనసాగించాలన్నారు. సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా సెక్రటరీ కమల్‌కిరణ్, కోశాధికారి శేషగిరిరావు, పబ్లిసిటీ సెక్రటరీ మజూర్, నాయకులు రాజయ్య, మురళీ, నాగరాజు, వరప్రసాద్, గౌస్‌బాషా, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనరసయ్య, లక్ష్మీకాంతమ్మ, వింధ్యావళి తదితరులు పాల్గొన్నారు.