
వైఎస్ జగన్‌ది దూర ఆలోచన
పేద విద్యార్థుల మెడికల్ కలను సాకారం చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది ‘దూర’ ఆలోచన చేస్తే.. చంద్రబాబు స్వార్థంతో, కుట్రలతో ‘దుర’ ఆలోచన చేస్తున్నాడు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు చదువుకోలేరు. ప్రైవేట్ వైద్యశాలల్లో పేదలకు మంచి వైద్యం అందే పరిస్థితి ఉండదు. విద్య, వైద్యం పేదలకు అందాలంటే ప్రభుత్వమే నిర్వహించాలని విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు లేకపోవడం బాధాకరం. కూటమి నిర్ణయాలకు సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్