వసతుల్లేవు.. అకాడమీలా? | - | Sakshi
Sakshi News home page

వసతుల్లేవు.. అకాడమీలా?

Oct 6 2025 2:02 AM | Updated on Oct 6 2025 2:02 AM

వసతుల

వసతుల్లేవు.. అకాడమీలా?

కూటమి ప్రభుత్వంలో

క్రీడా రంగం నిర్లక్ష్యం

సిబ్బందికి జీతాలు ఎప్పుడిస్తారో..

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను రూపొందించాల్సిన విధానాన్ని వదిలిపెట్టింది. ఉమ్మడి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బందికి 13 నెలలపాటు జీతాలివ్వలేదు. రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి నెలలో సగం జీతం మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం తీసుకుని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. రెండు నెలల క్రితం శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) సమావేశం పెట్టి కాంట్రాక్ట్‌ సిబ్బందికి పూర్తి జీతాలిస్తామని ప్రకటించింది. అయితే ఆ రెండు నెలల నుంచి ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. జిల్లా సంస్థలో 26 మంది కోచ్‌లు, సిబ్బంది పనిచేస్తున్నారు.

అంతంతమాత్రంగా..

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వసతుల్లేవు. ఆడేందుకు మైదానాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. కనీసం మార్కింగ్‌ వేసేందుకు సున్నంకు కూడా డబ్బుల్లేవు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి మార్కింగ్‌, తాగునీటి వసతి, లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితితోపాటు జీతాలందని కోచ్‌లు, సిబ్బంది పనిచేయడమే కష్టంగా ఉంది. క్రీడాకారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు నామమాత్రంగా జరిగాయి. క్రీడాకారులకు పరికరాల్లేవు. నగదు ప్రోత్సాహం సరిపోలేదు. ఇండోర్‌ స్టేడియంలో ఆడేందుకు వసతులు తక్కువే. ఫ్లోరింగ్‌ నుంచి స్లాబ్‌ వరకు అత్యంత ప్రమాదకరంగా ఉంది. స్విమ్మింగ్‌ పూల్లో నీటిని శుభ్రపరచడానికి కూడా వ్యయం భరించలేని పరిస్థితి నెలకొంది. వాకింగ్‌ ట్రాక్‌, హాకీ మైదానం గుంతలమయంగా తయారైంది. సిమెంట్‌ ఫ్లోరింగ్‌ ఉన్న బాస్కెట్‌బాల్‌ కోర్టు నిండా నెర్రెలు ఏర్పడ్డాయి. వీటిని మరమ్మతులు చేసే ప్రయత్నాలు జరగలేదు.

చిన్నచూపు చూస్తూ..

కూటమి ప్రభుత్వం కనీస వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ఇటీవల అకాడమీలను ఏర్పాటు చేస్తామంటూ శాప్‌ అధికారి, డైరెక్టర్ల బృందం నగరంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించి హడావుడి చేశారు. అసలు ప్రభుత్వం క్రీడా రంగాన్ని చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో అకాడమీలు ఎప్పటికి ప్రారంభమవుతాయని సీనియర్‌ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. పరికరాలు, కోచింగ్‌ ఇచ్చే సిబ్బంది బాగోగులు పట్టించుకోకుండా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతి జిల్లాలో అకాడమీలను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమంటున్నారు.

కోచ్‌ల సంఖ్య : 5

డేటా ఎంట్రీ ఆపరేటర్లు : 2

అకౌంటెంట్‌ : 1

ఆఫీస్‌ సబార్టినేట్‌ : 3

గ్రౌండ్‌ మార్కర్‌, గ్రౌండ్‌ మెన్‌,

సెక్యూరిటీ : 3

నైట్‌ వాచ్‌మెన్‌, డే వాచ్‌మెన్‌ : 2

ఇండోర్‌ స్టేడియం అటెండర్‌ : 2

స్విమ్మింగ్‌ పూల్‌ సెంటర్లు : 2

స్విమ్మింగ్‌ పూల్‌ వాచ్‌మెన్‌లు : 2

ఎలక్ట్రీషియన్‌ : 1

కేర్‌టేకర్‌ వెంకటగిరి సెంటర్‌ : 1

కేర్‌టేకర్‌ గూడూరు సబ్‌ సెంటర్‌ : 1

కేర్‌టేకర్‌ ఓజిలి సబ్‌ సెంటర్‌ : 1

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

వసతుల్లేవు.. అకాడమీలా? 1
1/2

వసతుల్లేవు.. అకాడమీలా?

వసతుల్లేవు.. అకాడమీలా? 2
2/2

వసతుల్లేవు.. అకాడమీలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement