
ప్రాణం తీసిన ఈత సరదా
● ఒకరి మృతి, మరొకరు గల్లంతు
నెల్లూరు సిటీ: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని కొత్తూరు శ్రీలంక కాలనీకి చెందిన గణేశన్ నరసింహ అలియాస్ విశాల్ (19) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల దేవరపాళెంలోని అమ్మమ్మ ఇంటికొచ్చాడు. నరసింహకు అదే ప్రాంతానికి చెందిన బేల్దారి పనులు చేసే కోటయ్య, విజయ్, లోకేశ్‌లు స్నేహితులు. ఆదివారం నలుగురూ ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లారు. విజయ్‌కు ఈత రాకపోవడంతో దిగలేదు. అయితే లోకేశ్, కోటయ్య, నరసింహ నదిలోకి దిగారు. కోటయ్య, నరసింహకు కూడా ఈత రాదు. నదిలో వారిద్దరూ గల్లంతయ్యారు. ఇది గుర్తించిన లోకేశ్ కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో సీఐ వేణు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లు వారి కోసం గాలించారు. నరసింహ మృతదేహాన్ని బయటకు తీశారు. కోటయ్య కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సోమవారం ఉదయం పరిశీలిస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఒకరు మృతిచెందడం, మరొకరు గల్లంతు కావడంతో దేవరపాళెంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా