
కొందరికే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం
● 38 వేల మంది ఉంటే 17 వేల మందికే..
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం పేరుతో మోసం చేసిందని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజా ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్‌కు రూ.30 వేల వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 38 వేల మంది ఆటో డ్రైవర్లుంటే 17,400 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని, 300 విద్యుత్ యూనిట్లు కరెంట్ బిల్లు, వాహనాలపై పెండింగ్‌లో ఉన్న పాత చలానాలు వంటి చిన్న కారణాలు చూపుతూ ఎగనామం పెట్టారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అత్యఽధికంగా చలానాలు విధించే జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు పెంచలయ్య, రవీంద్ర, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో 58.460 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలా శయం నుంచి కండలేరుకు 3,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 430, పిన్నేరు కాలువకు 140, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.