విద్యాశాఖలో బదిలీలలు | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో బదిలీలలు

Oct 6 2025 2:02 AM | Updated on Oct 6 2025 2:02 AM

విద్యాశాఖలో బదిలీలలు

విద్యాశాఖలో బదిలీలలు

ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. కూటమి నాయకుల జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అఽధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్రం తిప్పినట్లు తెలిసింది. కొందరు టీచర్ల నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకుని రికమండ్‌ చేసినట్లు సమాచారం.

నెల్లూరు(టౌన్‌): ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించారు. పాత నెల్లూరు జిల్లా నుంచి 21 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వీరిలో 17 మంది ఎస్జీటీలు, నలుగురు స్కూల్‌ అసిస్టెంట్లున్నారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి 23 మంది టీచర్లు వచ్చారు. వీరిలో 18 మంది ఎస్జీటీలు, ఐదుగురు స్కూల్‌ అసిస్టెంట్లున్నారు. వీరందరూ జిల్లా విద్యాశాఖాధికారికి రిపోర్ట్‌ చేయగా ఆయా స్థానాలు కేటాయించారు.

ఇద్దరికి స్పెషల్‌ ఆర్డర్లు

మ్యూచువల్‌, స్పౌజ్‌తో సంబంధం లేకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసింది. ఈ విషయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కోట మండలం మల్లాం జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌ను నెల్లూరు నగరం దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌కు, పెళ్లకూరు మండలం నెలబల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌ను కోవూరులోని జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీలు అక్రమంగా జరిగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా ఉత్తర్వులు జారీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

అంతర్‌ జిల్లాల ట్రాన్స్‌ఫర్స్‌లో అక్రమాలు

ఇతర జిల్లాల నుంచి

21 మంది టీచర్ల రాక

ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు 23 మంది

మరో ఇద్దరి బదిలీకి నేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు

చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు

డబ్బులిచ్చి..

మ్యూచువల్‌, స్పౌజ్‌ అవకాశమున్న వారికి అంతర్‌ జిల్లాల బదిలీలు నిర్వహిస్తారు. జిల్లాలో పనిచేస్తున్న టీచర్‌, మరో జిల్లాలో పనిచేస్తున్న వారు మ్యూచువల్‌పై బదిలీ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ విషయంలో కొందరు అక్రమాలకు తెరలేపారు. కూటమి నేతల జోక్యం ఎక్కువైంది. పలువురు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి బదిలీలు చేయించుకున్నారని ప్రచారం ఉంది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కొందరికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాఽధికారి బాలాజీరావును వివచారణ కోరగా మ్యూచువల్‌, స్పౌజ్‌లకు సంబంధించి బదిలీల్లో అక్రమాలు జరగలేదన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్డర్లు వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement