జిల్లా కోర్టు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి, పోక్సో, జువైనల్ లాంటి అనేక కోర్టులు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నాయి. వాటిలో చాలావరకు అద్దెభవనాల్లో అరకొరవసతుల మధ్య పనిచేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రాఘవాపూర్‌లో పదెకరాల స్థలం కేటాయించింది. అన్నికోర్టులు ఒకేసముదా యంలో నిర్మించేలా అందరం ఏకభిప్రాయంతో ముందుకు సాగుతాం. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించుకునేలా చూస్తాం.
– లకిడి భాస్కర్, అధ్యక్షుడు,
పెద్దపల్లి బార్ అసోసియేషన్