
ఇక ప్రమాద రహిత మూలమలుపు
గోదావరిఖని: రాజీవ్ రహదారిపై జిల్లాలోనే అత్యంత ప్రమాదకరమైన సింగరేణి జీఎం ఆఫీస్ మూలమలుపు(గోదావరిఖని – మంచిర్యాల మార్గం) విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. వారంలో కనీసం ఒక్క ప్రమాదమైనా ఇక్కడ చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రధానంగా భారీవాహనాలు తరచూ అదుపుతప్పి బోల్తాపడడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదాల్లో అనేకమంది వాహనదారులు గాయాలపాలవుతున్నారు. ఆస్పత్రుల్లో చేరి ఖర్చులపాల వుతున్నారు. అంతేకాదు.. విలువైన వాహనాలు ధ్వంసమవుతూ ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. మంచిర్యాల నుంచి కరీంనగర్‌వైపు వెళ్లే భారీవాహనాలు అదుపు తప్పుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
రద్దీగా మారిన రహదారి..
అప్పటి పరిస్థితులు, స్థలం లభ్యత ఆధారంగా హె చ్‌కేఆర్.. ఫోర్‌లేన్ రాజీవ్ రహదారి నిర్మించింది. గోదావరిఖనికి సమీపంలోని గోదావరిపై రెండు వంతెనలు నిర్మించడం, జగ్ధల్‌పూర్ హైవేకు అను సంధానం కావడంతో వాహనల రద్దీ పెరిగింది. అతిసమీపానికి వచ్చేంతవరకూ ఇక్కడి మూలమలుపు కనిపించడం లేదు. దీంతో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ప్రధానంగా వేకువజామున ఈ ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సూచిక బోర్డులు, స్టాపర్లను ఏర్పాటు చేసినా ప్రమాదాలు తగ్గకడంలేదు.
శాశ్వత పరిష్కారం దిశగా..
ప్రమాదాల నియంత్రణపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ దృష్టి సారించారు. ట్రాఫిక్, సివిల్ పోలీస్లు, సింగరేణి యాజమాన్యం, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. సింగరేణి జీఎం ఆఫీస్ మూలమలుపును యాక్సిడెంట్ ప్రీజోన్‌గా మార్చేందుకు ప్రణాళిక తయారు చేయా లని సూచించారు. ఇటీవల బీ గెస్ట్‌హౌస్ వద్ద రాజీ వ్ రహదారిపై మూలమలుపు పరిశీలించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్ లైన్లను తొ లగించాలని సూచించడంతో ఇటీవల హైవేపై రాక పోకలు నిలిపివేసి వాటిని తొలగించారు. సోమవా రం గెస్ట్ హౌస్ ప్రహరీ తొలగించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంచిర్యాల వైపు వెళ్లే మార్గాన్ని ప్రీక్రాసింగ్‌గా మార్చేందుకు హెచ్‌కేఆర్ పనులు శరవేగంగా చేస్తోంది. విస్తరణ పూర్తయ్యాక వాహనాల రాకపోకలు క్రమపద్ధతిలో సాగేందుకు వీలుగా రోడ్డు మధ్య రౌండ్ సర్కిల్ నిర్మించాలని యోచిస్తున్నారు.
మూలమలుపు విస్తరణ మ్యాప్
బీ – గెస్ట్‌హౌస్ వైపు చేపట్టిన విస్తరణ పనులు
జీఎం ఆఫీస్ వద్ద విస్తరణ పనులు షురూ
రంగంలోకి దిగిన హెచ్‌ఆర్‌కే సంస్థ
ఊపిరి పీల్చుకుంటున్న వాహనదారులు

ఇక ప్రమాద రహిత మూలమలుపు