
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
రామగిరి(మంథని): యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, సీఐ రాజు అన్నారు. సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో మంగళవారం నశా ముక్త్ భారత్ అభియాన్.. బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలకు చెందిన అక్రమార్కులు కొందరు.. తెలంగాణ యువ మేధావులను మత్తు పదార్థాల వైపు మళ్లిస్తున్నారని, తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని లక్ష్యంపైనే గురి పెట్టాలన్నారు. ప్రతినిధులు స్వర్ణలత, అరుణ, సుచరిత, శ్యామల, శ్రీనివాస్ పాల్గొన్నారు.