
డ్రై డేగా పాటించాలి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి ): గ్రామాల్లో ప్రతీ శుక్రవారం డ్రై డే పాటిస్తే వ్యాధులు దరిచేరవని డీఎంహెచ్‌వో వాణిశ్రీ అ న్నారు. పెద్దపల్లి మండలం రాగినేడు, సుల్తానా బాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ వర్కర్లు, డాక్టర్లు, సి బ్బందితో సమావేశమయ్యారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు కనీసం 30 ఇళ్లు సందర్శించి దోమలు, లార్వా వృద్ధిని నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణు ల వివరాలు నమోదు చేయాలని సూచించా రు. క్షయ బాధితులు మందులు వాడేలా చూ డాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆ ఫీసర్లు రాజమౌళి, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, వైద్యాధికారి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పంచాయతీ వర్క ర్స్, ఎంప్లాయీస్‌కు బకాయిపడ్డ వేతనాలను సత్వరమే చెల్లించాలని వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జ రిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీ ఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా రు. పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్‌చానల్ ద్వారా చెల్లించాలని, మల్టీపర్పస్ విధానా న్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విధి ని ర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాల కు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. నాయకులు రవీందర్, ఎండీ ఖాజా, రాంచందర్, శ్రీనివాస్, భాస్కర్, నాగేశ్వర్, నాగయ్య, నరేశ్, అశోక్, తిరుపతి పాల్గొన్నారు.
పోస్టాఫీసుల్లో డిజిటల్ లావాదేవీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్న డిజిటల్ లావాదేవీల ను ఖాతాదారులు వినియోగించుకోవాలని పో స్టల్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్ సూచించా రు. మున్సిపల్ కమిషనర్ రమేశ్‌తో కలిసి బ ల్దియా కార్యాలయంలో క్యూఆర్ కోడ్ కలిగిన స్కానర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీవనజ్యోతి, ప్రమాద బీమా, డి జిటల్ లావా దేవీల ద్వారా కస్టమర్లకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ము న్సిపల్ మేనేజర్ అలీమొద్దీన్, ప్రతినిధులు క్రాంతికుమార్, స్వరూప, శ్రీకాంత్, మౌనిక, తిరుపతి, వీధివ్యాపారులు పాల్గొన్నారు.
‘బోయలను మోసం చేస్తున్నారు’
ఎలిగేడు(పెద్దపల్లి): వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ప్రతీఎన్నికల్లో రాజ కీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయని, ఆ త ర్వాత మోసం చేస్తున్నాయని వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుడుగుల మహేంద ర్ విమర్శించారు. స్థానిక వాల్మీకి భవనంలో మంగళవారం వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. మహేందర్ మాట్లాడుతూ, ఏ రా ష్ట్రంలో అయినా ఒక కులానికి ఒకే రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని, తమ కులానికి మా త్రం ఒకేరాష్ట్రంలో రెండు రిజర్వేషన్లు ఇవ్వడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో నాయకు లు ముత్కెల మల్లేశం, భోగి శ్రీనివాస్, కుడుదుల నరేశ్, కుడుదుల తిరుపతి, బుకాల శ్రీ కాంత్, బలంతుల భూమయ్య, బలంతుల రా జ్‌కుమార్, సప్పుల సురేశ్, భోగి లచ్చయ్య, సప్పుల కొమురయ్య పాల్గొన్నారు.
మేడారానికి ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని నుంచి మేడా రం వరకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తుందని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈనెల 10న ఉదయం 5 గంటలకు గోదావరిఖనిలో బయలు దేరుతుందన్నారు. మార్గమధ్యంలోని రామప్ప దేవాలయం, లక్న వరం, మేడారం, బొగత వాటర్ ఫాల్స్ సందర్శించాక అదేరోజు రాత్రి గోదావరిఖనికి చేరు కుంటుందన్నారు. పెద్దలకు ఒక్కరికి రూ.900, పిల్లలకు రూ.700గా చార్జీ నిర్ణయించామన్నా రు. వివరాలకు 70135 04982, 73828 47596 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

డ్రై డేగా పాటించాలి

డ్రై డేగా పాటించాలి

డ్రై డేగా పాటించాలి