
పత్తి కుళ్లిపోయింది
సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవలేదు. నాకున్న ఎకరంన్నరలో ఆలస్యంగానే పత్తి ఏసిన. దాదాపు రూ.35వేల పెట్టుబడి పెట్టా. మొన్నటి వానలతో పత్తి జాలుపట్టింది. ఆకుఎర్రబడింది. పంట కుళ్లిపోయింది. ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి నీళ్ల పాలైంది.
– ఎంబాడి సమ్మయ్య, రైతు, ఓదెల
వానపాలైంది
మొదట్లో వానలు కురవక పత్తి మొక్కలు పెరగలే. రెండోసారి ఎడతెరిపి లేని, మొన్నటి భారీవానలతో పత్తి ఇగురు బోల్స్‌పూత మురిగి రాలిపోయింది. ఆకుముడత, దోమతోని ముడత వచ్చింది. రూ.60 వేలు పెట్టుబడితో రెండు ఎకరాల్లో పత్తి ఏస్తే పంట అంతా వానలపాలైంది.
– చింతం రాజేందర్, రైతు, ఓదెల
పెట్టుబడి ఎల్లేలా లేదు
నాకున్న నాలుగెకరాల్లో పత్తి వేసిన. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల దాకా ఖర్చయ్యింది. వరుసగా కురిసిన వర్షాలతో పంట దెబ్బతిన్నది. పోయినేడు 15 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. ఈసారి ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. పెట్టుబడి అంతా వర్షం పాలైంది.
– బడికెల సతీశ్, రైతు, ఉప్పట్ల
పూత నల్లబడింది
రెండెకరాలు కౌలుకు తీసుకుని ఒకఎకరంలో పత్తి వేసిన. వానలతో చేన్ల నీళ్లు నిలిచి పంట పాడైంది. చెట్లు, ఆకులు ఎర్ర పడుతున్నయి. పువ్వు నల్లబడిపోతుంది. పెట్టుబడి రూ.40 వేల వరకు వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి కానరావడం లేదు.
– ఒద్ది లక్ష్మణ్, రైతు, కాల్వశ్రీరాంపూర్

పత్తి కుళ్లిపోయింది

పత్తి కుళ్లిపోయింది

పత్తి కుళ్లిపోయింది