
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి
పెద్దపల్లిరూరల్: నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ట్రెయినీ కలెక్టర్ బనావత్ వనజతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. ప్రతీఒక్కరు హ్యాండ్‌బుక్ చదివి అర్థం చేసుకోవాలన్నారు. సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలను సమన్వయంతో గుర్తించాలని సూచించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.
12 వరకు వీ హబ్ సిద్ధం కావాలి
రంగంపల్లిలో ఏర్పాటవుతున్న వీ హబ్ సెంటర్ ప నులను ఈనెల 12 వరకు పూర్తిచేసి సిద్ధంగా ఉంచా లని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. వీహబ్ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా వ్యాపా ర, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారితను ప్రోత్స హించేందుకు వీ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులోకి తేవాలి
రామగుండం: స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రూ.రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు సకాలంలో పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోగా వినియోగంలోకి తేవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు తరగతి పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్ మహేందర్‌గౌడ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ అప్పలనాయుడు, ఏఈ శ్రీనివాస్, హెచ్‌ఎం అజ్మీరా శారద తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికలపై అవగాహన పెంచుకోవాలి
అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు