రైళ్లన్నీ రద్దీ | - | Sakshi
Sakshi News home page

రైళ్లన్నీ రద్దీ

Oct 7 2025 3:59 AM | Updated on Oct 7 2025 3:59 AM

రైళ్ల

రైళ్లన్నీ రద్దీ

రైళ్లన్నీ రద్దీ వృత్తి శిక్షణ కోర్సుల్లో చేరాలి టీబీ బాధితులను గుర్తించాలి

రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దసరా పండుగ సెలవులు ముగిశాయి. పండుగ కోసం స్వస్థలాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయా ణం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల వైపు వెళ్తున్న రైళ్లు సోమవారం ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా భాగ్యనగర్‌, బల్హర్షా, ఇంటర్‌సిటీ, సింగరేణి, కాగజ్‌నగర్‌, దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రయాణం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

గోదావరిఖని: సింగరేణి యాజమా న్యం ఉచితంగా అందించే వృత్తి శిక్షణ తరగతులను సద్వినియోగం చే సుకుని రాణించా లని ఆర్జీ– వన్‌ జీ ఎం లలిత్‌కుమార్‌ కోరారు. సింగరేణి సేవా సమితి ఆధ్యర్యంలో నిరుద్యోగ మహిళల జీవనోపాధి కోసం టైలరింగ్‌, బ్యూటీషియన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం వర్క్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, క్లాత్‌/జూట్‌/బంజారా బ్యాగ్స్‌ తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు గనుల సంక్షేమాధికారులు, డిపార్ట్‌మెంట్లు, జీఎం కార్యాలయంలోని పర్సనల్‌ విభాగం, సింగరేణి సేవా సమితి కార్యాలయంలో దరఖాస్తు ఫారాల కోసం సంప్రదించాలన్నారు. ఆధార్‌, సర్టిఫికెట్ల జిరాక్స్‌, 2 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఈనెల15లోగా సింగరేణి సేవా సమితి కార్యాలయంలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో క్షయ(టీబీ) బాధితులను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూచించా రు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. క్షయ బాధితులకు ఉచితంగా మందులు అందించి, సక్రమంగా వాడేలా ప్రోత్సహించాలని అన్నారు. ఇంటింటా జ్వర సర్వే చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి సేవలు పొందేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సూచించారు. తెలంగాణ నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ ప్రోగ్రాం యాప్‌ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ నిర్వహణ సమయంలో వివరాలు నమోదు చేయాలని అన్నారు. అధికారులు రాజమౌళి, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, మధుసూదన్‌, రాజేశం, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై సమావేశం

మంథని: స్థానిక మాతా శిశు, సామాజిక వైద్యశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై మంత్రి శ్రీధర్‌బాబు కార్యాలయంలో జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ సోమవారం సమావేశం నిర్వహించారు. కార్మికులు, కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు. వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఇతరత్రా సౌకర్యాలపై చర్చించారు. దసరా పండుగవేళ తాము పస్తులు ఉన్నామని ఈనెల 1న కార్మికులు మంత్రి కార్యాలయానికి చేరుకున్న విషయం విదితమే. అప్పుడు స్పందించిన మంత్రి.. అదేరోజు కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పీఏ చంద్రశేఖర్‌, మంథని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌, ప్రజాసంఘాల నాయకులు బూడిద గణేశ్‌, ఆర్ల సందీప్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

రైళ్లన్నీ రద్దీ 1
1/3

రైళ్లన్నీ రద్దీ

రైళ్లన్నీ రద్దీ 2
2/3

రైళ్లన్నీ రద్దీ

రైళ్లన్నీ రద్దీ 3
3/3

రైళ్లన్నీ రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement