
విస్తరణ పనులు ప్రారంభం
గోదావరిఖని: రాజీవ్ రహదారిపై బీ – గెస్ట్‌హౌస్ వద్ద అత్యంత ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు విస్తరణ పనులను సోమవారం ప్రారంభించారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో హెచ్‌కేఆర్ పనులు చేపట్టింది. కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, సింగరేణి శ్రీనన్న పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు విస్తరణ పనులు చేపట్టామని నాయకులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని మూలమలుపు ప్రాంతాన్ని విస్తరించి అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు.