
కమ్యూనిటీహాల్ అద్దె తగ్గించాలి
గోదావరిఖని: పెంచిన కమ్యూనిటీహాల్ అద్దె తగ్గించాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ కోరారు. జీఎం కార్యాలయంలో ఎస్‌వోటూ జీఎం రాముడును సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, కమ్యూనిటీహాల్ అద్దెను రూ.558 నుంచి రూ.15వేలకు ఒకే సారి పెంచడంతో కార్మిక కుటుంబాలపై ఆర్థికభా రం పడుతుందన్నారు. కొన్ని ప్రైవేట్ ఫంక్షన్‌హాళ్లు రూ.25వేలకే టెంట్ సామానుతో సహా అద్దెకు ఇస్తు న్నాయని ఆయన గుర్తుచేశారు. పోతనకాలనీలో ఆ రు నెలల క్రితమే నిర్మాణం పూర్తిచేసిన కమ్యూనిటీహాల్‌ను వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తేవాలని కోరారు. నాయకులు ప్రభాకర్‌రెడ్డి, బేతి చంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, రవితేజ, దాసరి శ్రీనివాస్, వెంకటేష్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.