
ఇక సింగరేణి బంక్‌లు
డీజీల్, పెట్రోల్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సంస్థ వ్యాప్తంగా ఏడు బంక్‌ల ఏర్పాటు ఇంధన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు నిర్వహణ బాధ్యతలు బొగ్గు గనుల సంస్థకే.. మరికొందరికి ఉపాధి అవకాశాలు
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ మరో వ్యాపార రంగంలోకి అడుకు పెట్టబోతోంది. ఇకనుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు సాగించాలని నిర్ణయించింది. సంస్థకు చెందిన స్థలాల్లో బంక్‌లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. సంస్థవ్యాప్తంగా ఏడు బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం పెట్రోలు, డీజిల్ విక్రయ సంస్థలు హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్‌తో ఇటీవల ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. ఇంధన సంస్థలు బంక్‌లు నిర్మిస్తుండగా.. నిర్వహణ బాధ్యతలు సింగరేణి యాజమాన్యం చేపట్టనుంది. విక్రయించే ఇంధనంపై ఆయా కంపెనీలు సింగరేణికి కమీషన్ చెల్లించనున్నాయి. ఇంధన సంస్థలు పెట్రో బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ఏడు ప్రాంతాల్లో స్థలాలు కూడా కేటాయించారు.
వేగవంతంగా అనుమతులు..
సింగరేణిలో ఏర్పాటు చేయనున్న 7 పెట్రోల్ బంక్‌లకు అవసరమైన స్థలాలను ఇంధన సంస్థలకు సింగరేణి అప్పగించాల్సి ఉంది. దీనికి ఎన్‌వోసీని యా జమాన్యం సిద్ధం చేస్తోంది. కలెక్టర్, పోలీసు అధికారులు, ఆర్డీవో, భూసేకరణ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎక్స్‌ప్లోజివ్స్ పర్మిషన్ నాగ్‌పూర్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం బంక్‌ల నిర్మా ణం చేపట్టనున్నారు. క్లియరెన్స్ కోసం ఇప్పటికే ఎన్‌వోసీకి దరఖాస్తు చేశారు. ఒక్కో బంక్ ఏర్పాటు కు 1,076 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయి స్తున్నారు. అన్నీ సక్రమంగా సాగితే.. వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు సింగరేణి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఒక్కోబంక్ నిర్మాణ వ్యయం రూ.1.57 కోట్లు అవుతుందని, ఇంధన విక్రయ సంస్థలే ఈ పెట్టుబడి భరిస్తాయని అధికారులు వివరిస్తున్నారు.
ఇప్పటికే సొంత బంక్‌లు
సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో యాజమాన్యం తన అవసరాల కోసం ఐదు దశాబ్దాల క్రితమే డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసింది. ఓసీపీల్లో పనిచేసే భారీయంత్రాల్లో నిత్యం పెద్దఎత్తున డీజిల్ అవసరం అవుతోంది. ఈక్రమంలో అన్ని ఓసీపీలపై బంక్‌లు ఏర్పాటు చేసింది. ఇంధన సంస్థల నుంచి నేరుగా ఇంధనం కొనుగోలు చేసి తమ బంక్‌ల్లో ఫిల్లింగ్‌చేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. బంక్‌ల నుంచి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా భారీయంత్రాలకు డీజిల్ ఫిల్లింగ్ చేస్తున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి..
పెట్రోల్ బంక్‌లను ఆయా ఇంధన సంస్థలు ఏ ర్పా టు చేసి సింగరేణికి అప్పగింస్తాయి. డీజిల్, పె ట్రోల్ విక్రయాల ఆధారంగా ఆ యా సంస్థలు సింగరేణికి కమీషన్ చెల్లిస్తాయి. బంక్‌ల నిర్మాణాన్ని సింగరేణి ఎస్టేట్ విభాగం పర్యవే క్షిస్తోంది. నిర్మాణం పూర్తయి వ్యా పారం ప్రారంభం సమయంలో ఏరియా స్టోర్‌లకు అప్పగించా లా? లేక సూపర్‌బజార్‌కు అప్పగించాలా? అనే అంశాలపై లోతు గా అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు.. ఏడు బంక్‌ల ఏర్పాటు ద్వారా సుమారు 70 మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
బంక్‌ల ఏర్పాటు ఇలా..
ఏరియా ఏర్పాటు చేసే ప్రాంతం కంపెనీ
రామగుండం–1 రాజీవ్ రహదారి హెచ్‌పీసీఎల్
రామగుండం–2 పాత హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఐసీవోఎల్
రామగుండం–2 రెడ్డికాలనీ బీపీసీఎల్
మందమర్రి ఎన్‌హెచ్–363 నర్సరీ హెచ్‌పీసీఎల్
మందమర్రి బెల్లంపల్లి పట్టణం హెచ్‌పీసీఎల్
మణుగూరు 33 కేవీ సబ్‌స్టేషన్ బీపీసీఎల్
కొత్తగూడెం ఆదివారం సంత హెచ్‌పీసీఎల్