యువకుడు అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Oct 8 2025 6:41 AM | Updated on Oct 8 2025 6:41 AM

యువకు

యువకుడు అనుమానాస్పద మృతి

యువకుడు అనుమానాస్పద మృతి గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి

కవిటి: మండలంలోని సహలాలపుట్టుగలో ఈనెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసు వివరాలను కవిటి పోలీసులు మంగళవారం ఆలస్యంగా మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొనియా సురేష్‌ ప్రధాన్‌(25) ఈనెల 1వ తేదీన తన జీడితోటలో జీడిచెట్టుకు టవల్‌తో ఉరివేసుకుని వేలాడుతుండడంతో అతని అక్క కె.పద్మ చూసింది. వెంటనే గ్రామస్తులు కవిటి పోలీసులకు తెలిపారు. దీంతో 2వ తేదీ ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్టు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ విషయం ఎందుకు ఇన్ని రోజులు మీడియాకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. తాను బందోబస్తు డ్యూటీకి వెళ్లిపోయినందువల్ల ఆలస్యం జరిగిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై పడి ఒక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందారు. వ్యక్తిపై నుంచి ట్రైన్‌ వెళ్లడంతో శరీరభాగాలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీనిని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు.

మందస: లగేజీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. తంగరపుట్టి గ్రామానికి చెందిన సవర విజయ్‌(25) సోమవారం మందస వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా రాయికోల గ్రామం వద్ద లగేజీ ఆటో ఢీకొంది. దీంతో తీవ్రగాయాలుపాలైన యువకుడిని వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రణస్థలం: మండలంలోని జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబటి యర్రయ్య (47) పడవ బోల్తాపడి మృతి చెందారు. జేఆర్‌పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. అంబటి యర్రయ్యతో పాటు మరో ముగ్గురు వాసుపల్లి పోతయ్య, దుమ్ము అప్పన్న, సూరాడ లక్ష్మణలు సముద్రంలో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఒడ్డుకు వస్తున్న సమయంలో భారీ కెరటాలకు పడవ బోల్తా పడి నలుగురూ సముద్రంలో పడిపోయారు. వారిలో దురదృష్టవశాత్తు అంబటి యర్రయ్య సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. మిగతా ముగ్గురు ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నారు. మృతుడికి భార్య యర్రమ్మ, ఇద్దరు కుమారుడు, కూతురు ఉన్నారు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యువకుడు అనుమానాస్పద మృతి 1
1/2

యువకుడు అనుమానాస్పద మృతి

యువకుడు అనుమానాస్పద మృతి 2
2/2

యువకుడు అనుమానాస్పద మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement