
ఉత్సాహంగా..
ఉల్లాసంగా..
జిల్లాలోని గుణుపూర్‌లో బాలల శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య, సంగీత పోటీలు అలరించాయి. జబర్‌గుడ, బాలనికేతన్, లిమామడ ప్రాంతాలోని సేవా సమాజంలో వంద మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా శిశు సురక్ష సమితి యూనిట్ అధికారి సీహెచ్ మహాదేవ్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులను ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు మనోజ్ జెన్న, శివప్రసాద్ దాస్, సత్యనారాయణ జెన్నాలు, ఒడిశా నృత్య కళాకారుడు సుస్మిత పండ, గురు దిలీప్ చౌధరి, సాగరిక రాజ్‌గురులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
–రాయగడ

ఉత్సాహంగా..

ఉత్సాహంగా..

ఉత్సాహంగా..