
చోరీ కేసులో నిందితుల అరెస్టు
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను మునిగుడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకేపూర్ ప్రాంతానికి చెందిన సుజిత్ కొరకొరియా, అజయ్ బాగ్, మునిగుడకు చెందిన పింటు టకరి, ప్రమోద్, అమ్రాన్ భత్రలు ఉన్నారు. మునిగుడ ఎస్‌డీపీవో సంతోషిణి ఓరం, ఐఐసీ సౌదామణి బెహరలు ఈ మేరకు మంగళవారం నాడు మునిగుడ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.