
పంట నష్టంపై సమీక్ష
పర్లాకిమిడి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, రాగులు, జొన్న పంటలు నాశనమయ్యాయి. జిల్లాలో నాలుగు సమితి కేంద్రాలు గుమ్మా, నువాగడ, రాయఘడ, మోహనా, గుసానిలో జరిగిన పంటనష్టంపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ మధుమిత సమీక్షించారు. గుసాని, గుమ్మా, సమితి కేంద్రాలను సందర్శించారు. గుమ్మా బీడీఓ దులారాం మరాండీ, తహసీల్దార్ శరత్ శోబోరో, బీఈఓ, ఇతర అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అధిక వర్షాలకు వంతెనలు, రోడ్లు, కల్వర్టులు నష్టమయ్యాయి. గజపతిలో రూ.80 కోట్ల నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా తెలియజేశారు.