
ఫోన్ ఇవ్వలేదని పదేళ్ల బాలిక ఆత్మహత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి గోవిందపల్లి పంచాయతీ డేప్‌సాహి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వనందుకు పదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కిర్సనీ కుమార్తె స్థానిక గోవిందపల్లి పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. తన తండ్రి మొబైల్ ఫోన్‌లో తరచూ ఆత్మహత్యల వీడియోలు చూస్తుండేది. దీనిని గమనించిన తండ్రి ఫోన్ ఇవ్వడం మానేశాడు. ఈ క్రమంలో సోమవారం తండ్రికి ఫోన్ అడిగింది. అందుకు నిరాకరించడంతో ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటి తర్వాత భోజనం కోసం తల్లి పిలవగా బాలిక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించిం ది. వెంటనే బాలికను కిందకు దించి మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మత్తిలి పోలీస్ ఐఐసీ దీపాంజాలి ప్రదాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.