
సీజేఐపై దాడికి యత్నం దురదృష్టకరం
శ్రీకాకుళం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నించడం దురదృష్టకరమని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద మానవహారం మంగళవారం నిర్వహించారు. ఆయా సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, కంఠ వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. సీజేఐపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు బడే కామరాజు, ముంజేటి కృష్ణ, బాడాన దేవభూషణరావు, రౌతు శంకరరావు, ఎంఏ రఫీ, మహిబుల్లా ఖాన్‌లతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ట దామోదరరావు, ఉపాధ్యక్షుడు సీతరాజు, ప్రతినిధులు బి.మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, చలపతిరావు, డి.రాజ్ కుమార్‌లు మాట్లాడుతూ సీజేఐ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖండించారు. ఈ ఘటన న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, నాగరిక సమాజంలో దాడులకి స్థానం లేదన్నారు. కార్యక్రమంలో దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ నాయకులు వైశ్యరాజు మోహన్, నటుకుల మోహన్, యజ్జల గురుమూర్తి, అర్జి కోటి, పురుషో త్తం రాంబాబు, సంతు, అర్జి ఈశ్వరరావు, కొయిలా పు విజయ్, కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, విజయ్, అఖిల్, రాము, మజ్జి గౌతమ్, రాహుల్, హేమంత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.