
పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం
కవిటి: వైఎస్సార్‌సీపీలో పార్టీ కోసం పనిచేసేవారికి సరైన ప్రాధాన్యం లభిస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని కొత్తపుట్టుగలో ఉన్న ఆయన నివాసంలో కవిటి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఎమ్మెల్సీగా శ్రీకాకు ళం జిల్లాతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించిన తీరును నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ.. శాసన మండలి సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించే అవకాశం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలనే దక్కిందని తెలియజేశారు. ఆయన ఆశయాల మేరకు ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కుసుంపురం గ్రామానికి చెందిన బెంతు సామాజిక నాయకుడు శివ బిసాయి మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల్లో తమ బెంతు ఒరియా ల సమస్యలను ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. కడియాల ప్రకాష్ మాట్లాడుతూ.. పరిపూర్ణమైన అవగాహనతోనే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారని కొనియాడారు. నియోజకవర్గంలోని రోగులు పడుతున్న అవస్థలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఉద్యోగాలు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న ఉద్దానం ఉద్యోగుల బాధలు, జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లేందుకు పౌరులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పాండవ శేఖర్, పీఎం తిలక్, పూడి నేతాజీ, బెందాళం జయప్రకాశ్, గోపయ్య, మురళి, బర్ల నాగభూషణం, కృష్ణారావు, నూతలపాటి బాబురావు, వై.అశోక్, రవి, నారాయణ స్వామి, బర్ల నాగు, కాయ భీమసేన్, దువ్వు కృష్ణారెడ్డి, పాండవ శేఖర్, పిరియా కృష్ణారావు, చందాన పూర్ణచంద్రుడు, దుద్ది ధర్మారావు, పాతిన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.