
భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు
జయపురం: జయపురంలో గజలక్ష్మి, కుమార పూర్ణిమ పూజలు ఆడంబరంగా సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. రఘునాథ్ మందిర కూడలిలో ఏర్పాటు చేసిన పెండాల్‌లో ప్రతిష్టించిన గజలక్ష్మీదేవి విగ్రహానికి వేద పండితులు కృష్ణదాస్, శుభాంశు త్రిపాఠీలు వైదిక నియమ నిష్టలతో పూజలు చేసి ఆరంభించి ఐదు రోజులు జరగనున్న గజలక్ష్మి పూజలకు శ్రీకారం చుట్టారు. గజలక్ష్మి పూజలు నిర్వహించే ఐదు రోజులు ప్రతి రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని పూజా కమిటీ అధ్యక్షులు దేవేంద్ర బాహిణీపతి వెల్లడించారు. అలాగే గజలక్ష్మి పూజలతో పాటు కుమార పూర్ణిమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పూజల అనంతరం స్థానిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్కళ సంస్తృతిలో కుమార పూర్ణిమ మహత్తు, ప్రాధాన్యలను వివరించారు. కార్తీక పూర్ణిమను అవివాహత యువతులు భక్తితో ఆదర్శ వంతుడైన భర్త కొరకు పూజలు జరుపుకుంటారని వివరించారు. రాత్రి చంద్రుడుని చూసి కార్తికేయునికి పూజలు చేయాలన్నారు. అనంతరం స్థానిక కళాకారుల సంబలపురి డాన్స్‌లతో పాటు పలు జానపద, శాసీ్త్రయ నృత్యాలు ప్రేక్షకులను అలరింప చేశాయి. జయపురం మున్నిపల్ చైర్మన్ నరేంద్రకుమార్, మహంతిబాబులి రథ్, రాజకిశోర్ దాస్, బాబు పాత్రో పాల్గగ్నారు. పూజల్లో, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించేందుకు అధికసంఖ్యలో జనం తరలివచ్చారు.
కొరాపుట్: గజలక్ష్మీ పెండాల్స్‌ను బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి మంగళవారం సందర్శించారు. నబరంగ్‌పూర్, కొసాగుమ్డ, నందాహండి సమితుల్లో గజలక్ష్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాలలో ఇటీవల మృతి చెందిన పలువురి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు