
గజలక్ష్మి పూజలు ప్రారంభం
రాయగడ: గజలక్ష్మీదేవి పూజలు ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూకాలనీలో 30 ఏళ్లుగా ఈ పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేశారు. గజలక్ష్మి అమ్మవారికి మంగళవారం నుంచి భక్తులు ప్రత్యేక పూజలను చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆవాహన, ప్రాణ ప్రతిష్ట పూజలు జరిగాయి. మంగళవారం నుంచి 17 తేదీ వరకు పూజలను నిర్వహిస్తున్నట్లు పూజా కమిటీ అధ్యక్షుడు సంతోస్ కుమార్ పాత్రో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా స్థానిక ఆర్‌కే నగర్, సబ్ కలెక్టర్ కూడలి వద్ద గజలక్ష్మి పూజలు ప్రారంభమయ్యాయి.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: స్థానిక గాంధీ జంక్షన్ ఒడియా మంగళి వీధి వద్ద మంగళవారం నుంచి గజలక్ష్మి పూజలను ప్రారంభించారు. కార్తీక మాసంలో గజలక్ష్మి పూజలు, దర్శనం వల్ల పుణ్యం లభిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈనెల 19 వరకూ పూజలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని పాత పోస్టుఫీస్ వీధిలో గత 26 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న గజలక్ష్మిదేవి ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా చేయడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గౌరీ పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

గజలక్ష్మి పూజలు ప్రారంభం

గజలక్ష్మి పూజలు ప్రారంభం

గజలక్ష్మి పూజలు ప్రారంభం

గజలక్ష్మి పూజలు ప్రారంభం

గజలక్ష్మి పూజలు ప్రారంభం