కటక్‌ నగరంలో కర్ఫ్యూ | - | Sakshi
Sakshi News home page

కటక్‌ నగరంలో కర్ఫ్యూ

Oct 7 2025 3:57 AM | Updated on Oct 7 2025 3:57 AM

కటక్‌

కటక్‌ నగరంలో కర్ఫ్యూ

36 గంటలపాటు కొనసాగింపు

భువనేశ్వర్‌: కటక్‌ మహా నగరంలో శాంతిభద్రతల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నగరంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించారు. దేవీ నవరాత్రులు ముగింపు పురస్కరించుకుని అనుపు ఊరేగింపులో చెలరేగిన వివాదాల వైపరీత్యం తాండవిస్తుంది. సోదరభావంతో కుల, మతాలకు అతీతంగా నగరంలో ప్రజలంతా కలిసి మెలిసి అన్యోన్యంగా ఏటా జరుపుకునే దుర్గా పూజలు ఈ ఏడాది ఆందోళనకరంగా మారడం విచారకరం. కటక్‌ నగరం సోదర భావం సంప్రదాయాన్ని పరిరక్షించడంలో నగర వాసులంతా సహకరించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్‌ వైబీ ఖురానియా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర పోలీసులు శాంతిభద్రతలను కాపాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని, సోషల్‌ మీడియాలో ప్రసారమయ్యే సమాచారాన్ని నమ్మవద్దని, పోలీస్‌ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మండని విజ్ఞప్తి చేశారు. సాంఘిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం, ప్రసారాల నివారణ దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. దీంతో పరిస్థితి ఆశించిన మేరకు అదుపులోకి రాకపోవడంతో నగర వ్యాప్తంగా 13 పోలీసు ఠాణాల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేసినట్లు స్పష్టం చేశారు. 36 గంటల పాటు కర్ఫ్యూ నిరవధికంగా కొనసాగుతుందని జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. దేవదత్త సింగ్‌ తెలిపారు.

కర్ఫ్యూ అమలు ప్రాంతాలు

నగర వ్యాప్తంగా 13 పోలీసు ఠాణాల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఆయా ప్రాంతాల్లో 36 గంటల పాటు కర్ఫ్యూ నిరవధికంగా కొనసాగుతుంది. దర్ఘా బజార్‌ పోలీస్‌ స్టేషన్‌, మంగళ్‌బాగ్‌, కంటోన్మెంట్‌, పూరీ ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌, లాల్‌బాగ్‌, బిడానాసి, మర్కత్‌ నగర్‌, సీడీఏ ఫేజ్‌ – 2, సదర్‌ పోలీస్‌ స్టేషన్‌, మాల్‌ గోదాం, బాదంబాడి, జగత్‌పూర్‌, బొయాలిస్‌ మౌజా ప్రాంతాలు కర్ఫ్యూలో ఉన్నాయి. వైద్య, అవసరమైన సేవలకు కరూ్‌ఫ్య్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. కటక్‌ నగరంలో కర్ఫ్యూ నిబంధనలో భాగంగా పెట్రోల్‌ పంపులు, బస్సులు, దుకాణాలు, బజార్లు, కటక్‌ గిడ్డంగులు మూసివేశారు. నగరం వైపు అమొ బస్సు (సిటీ బస్సు) సేవల్ని నిలిపి వేశారు. నగరంలో ప్రధాన బస్టాండ్‌ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల రవాణా, జాతీయ రహదారిపై సాధారణ రవాణా, వైద్య సౌకర్యాలు యథాతథంగా పని చేస్తాయి. ప్రస్తుతానికి మంగళ వారం ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరిస్థితి పురోగతి ఆధారంగా కర్ఫ్యూ సడలింపు, తొలగింపు లేదా పొడిగింపు ఆధారపడి ఉంటుందని నగర పోలీసు కమిషనరేటు తెలిపింది.

కటక్‌ నగరంలో కర్ఫ్యూ 1
1/1

కటక్‌ నగరంలో కర్ఫ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement