
లక్ష్మీ ఇందిర పండాకు ఘనంగా నివాళులు
జయపురం: సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో సేవలు అందించిన జయపురం మహిళ లక్ష్మీ ఇందిర పండాకు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. సోమవారం లక్ష్మీ ఇందిర పండా వర్ధంతి సందర్భంగా పట్టణంలో 26 వ జాతీయ రహదారి లక్ష్మీపండ జంక్షన్‌లో గల ఆమె నిలువెత్తు ప్రతిమకు పూజ్య పూజ సంసంద్ సభ్యులు నివాళులు అర్పిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ లక్ష్మీ ఇందిరా పండ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఇంజినీర్ కేదారనాథ్ బెహరా మాట్లాడుతూ నేతాజీ ఇండియన్ ఆర్మీలో సేనాపతిగా ఆమె సాగించిన పోరాటం చిరస్మరణీయం అని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆమె విగ్రహానికి పాలకులు సముచిత గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి జరిపేందుకు వీరత్వంతో పోరాడిన లక్ష్మీ ఇందిర పండాకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయపురం పూజ్య పూజ సంసద్ కార్యదర్శి, తపన్ త్రిపాఠీ, కేషియర్ భైరవ సాహుతో పాటు సమాజ సేవి ప్రమోద్ కుమార్ రౌళో, పాత్రికేయులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీ ఇందిర పండాకు ఘనంగా నివాళులు