
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
పర్లాకిమిడి:
గజపతి జిల్లా రాయగడ బ్లాక్ గంగాబడ పంచాయతీ ముంతవీధిలో విద్యుత్ ఘాతంలో బారిక్ శోబోరో (45) రైతు మృతి చెందగా, మరో వ్యక్తి నరేంద్ర శోబోరో విద్యుత్ షాక్‌తో పర్లాకిమిడి మెడికల్‌లో చికిత్స పొందుతున్నాడు. గారబంద ఎస్‌ఐ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగాబడ పంచాయతీ ముంత వీధికి చెందిన బారిక్ శోబోరో పొలానికి సాగునీరు పెట్టడానికి వెళుతుండగా ఆదివారం మోటారు పంపు సర్వీసు వైరు ఒక ఎదురు కర్రకు వేలాడుతుండగా దాన్ని ముట్టుకున్న బారిక్ శోబోరో విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. వెంటనే బారిక్ శోబోరోను కోయిపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తరలించి ప్రథమ చికిత్స చేశారు. అయితే అప్పటికే బారిక్ మృతి చెందాడు. అతనితో వచ్చిన నరేంద్ర శోబోరోను పర్లాకిమిడి కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆయన బతికి బయటపడ్డాడు. రాయగడ బీడీఓ సంతోష్ కుమార్ బారిక్ మృతుడు బారిక్ శోబోరో కుటుంబానికి రూ.20 వేలు తక్షణ సాయం చేశారు.