
జేకేపూర్‌లో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు
రాయగడ:
పారిశ్రామిక కేంద్రం జేకేపూర్‌లో గత నెల 28వ తేదీన ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా జేకేపేపర్ మిల్ పరిశ్రమ యజమాన్యం నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా కేదార్‌నాథ్ మందిరం తరహా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు పెండాల్ వద్ద సెల్పీలు తీసుకుని ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పెట్టుకుని ఆనందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కిస్ట్రాలో టీవీ ఛానల్ గాయనీ గాయకులు హాజరై జనాలను ఉర్రూతలూగించగా ప్రముఖ గాయకులు, ఇండియన్ ఆడిల్ శ్రీనివాస్ ధామిశెట్టి, అదితి భార్గవరాజులు తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చే భక్తులను, ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానిస్తుండటం విశేషం. ఇదిలాఉండగా ఉత్సవ మైదానంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారంతో ఉత్సవాలు ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు.

జేకేపూర్‌లో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు

జేకేపూర్‌లో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు

జేకేపూర్‌లో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు