
మాకు అదే పనేంటి..?
● జేఆర్‌పురం సీఐ అవతారం సమాధానం వైరల్
రణస్థలం: భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి కె.కిరణ్‌కుమార్ శ్రీకాకుళం వైపు నుంచి ఎచ్చెర్ల జాతీయ రహదారి మీదుగా వ్యాన్‌లో ఆవుల ఆక్రమ రవాణా జరుగుతోందని జేఆర్‌పురం సీఐ అవతారంనకు కాల్ చేయగా మాకు ఇప్పుడు అదే పనేంటి అని సీఐ మాట్లాడిన కాల్ రికార్డింగ్‌ను భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సోషల్ మీడియాలో సోమవారం వైరల్ చేశారు. కాల్ రికార్డులో ఉన్న సారంశం ప్రకారం ఫోన్ చేసిన వ్యక్తికి స్పందించిన సీఐ అవతారం మాట్లాడుతూ హలో ఎవరూ చెప్పండి అన్నారు. అవతల వ్యక్తి.. సార్ ఆవుల వ్యాన్ ఒకటి వస్తుందని అనగానే మాకు అదే పనేంటి ఇప్పుడు అని ఫోన్ కట్ చేశారు. దీనిపై సీఐ ఎం.అవతారం వివరణ కోరగా.. సాధారణంగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయాలన్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్‌పేటలో రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే.. తెల్లవారిజామున 4 గంటలకు ఫోన్ చేసి ఆవులు వ్యాన్ వస్తుందని అన్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉన్నా ఫోన్ లిప్ట్ చేశాను. జేఆర్‌పురం పోలీసులు పట్టుకుని చెక్ చేశారు. ఆ పశువులు అలమండ సంతకు రైతులు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.