
ముగిసిన వేడుక
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రావణ దహనంతో ..
జయపురం:
జయపురం దసరా ఉత్సవ కమిటీ వారి దసర ఉత్సవాలు శనివారం రాత్రి రావన దహనం కార్యక్రమంతో ముగిశాయి. దసరా నాడు పట్టణంలో కుండపోత వాన కురవడంతో రావణ దహనం జరగలేదు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచాలు, మిన్నంటిన తారా జువ్వల పేలుళ్లతో పట్టణం ప్రకాశించింది. స్థానిక దసరా పొడియాలో జరిగిన దసరా ముగింపు వేడుకలను వేలాది మంది ప్రజలు ఆస్వాదించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొరాపుట్ ఎస్పీ రోహిత్ కుమార్ బర్మ పాల్గొన్నారు. రోహిత్ వర్మ, దసర ఉత్సవ కమిటీ తారాప్రసాద్ బాహిణీపతిలు రావణ బొమ్మకు కలిపిన వైరు ముట్టించి రావణ దహనం చేశారు. అనంతరం దసరా ముగింపు సభ జరిగింది. కమిటీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ సభలో దసర స్మరణిక అపరాజిత–2025 పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. అలాగనే పరిశోధకుడు, రచయిత డాక్టర్ పరేష్ రథ్ కలం నుంచి వెలవడిన ‘మెమోరీ ఆఫ్ జయపురం దసరా’ ఆంగ్ల పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ’అపరాజిత–2025’ పుస్తక సంపాదక కమిటీ సభ్యులు జయపురం సాహిత్య పరిషత్ మాజీ అద్యక్షులు డాక్టర్ సురేష్ దాస్, సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, డాక్టర్ పరేష్ రథ్,నవకృష్ణ రథ్ లను ప్రశంసాపత్రాలు, మెమొంటాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. రావణుడి బొమ్మను స్థానిక కళాకారుడు పద్మనాభ చౌదురి తయారు చేశారని పేర్కొన్నారు. ముగింపు వేడుకల్లో గౌరవ అతిథిగా జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్, జయపురం పంచాయతీ సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీపతి, జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహారంజన్ బిశాయి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వేడుక

ముగిసిన వేడుక

ముగిసిన వేడుక

ముగిసిన వేడుక

ముగిసిన వేడుక

ముగిసిన వేడుక