
మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాలా ఆస్పత్రుల్లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు నోటీసు బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పలుచోట్ల అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వాటిని సీజ్ చేయని పక్షంలో పోరాటం తప్పదన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు రవి, ఎ.వసంతరావు, ముచ్చ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.