
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
కొరాపుట్: ఎదురెదురు వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో దంపతులు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి ఉమ్మర్‌కోట్ మార్గంలో తారాగాం వద్ద జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ మందిర్ రోడ్డులో మున్సిపల్ స్వీపర్ కాలనీకి చెందిన ముకుంద జానీ (35), అతని భార్య నందేయ్ జానీ (26)లు తమ పిల్లలతో కలిసి పపడాహండిలో దసరా వేడుకలు చూడడానికి వెళ్లారు. ఇదే సమయంలో ఎదురుగా మరో బైక్ శరవేగంగా వచ్చి వీరిని ఢీ కొంది. దీంతో ఘటనా స్థలంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. అయితే ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయట పడ్డారు. పపడాహండి, నబరంగ్‌పూర్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాలను నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.