
● చండీ రూపంలో అమ్మవారు
రాయగడ: దసర శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు చండీ రూపంలో ఆదివారం భక్తులకు దర్శనం ఇచ్చారు. స్థానిక కస్తూరీనగర్‌లోని సత్యనారాయణ ఆలయం ప్రాంగణంలో లక్ష్మీ అమ్మవారిని చండీరూపంలో అలంకరించారు. అర్చకులు మావుడూరు కిశోర్ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. స్థానిక రాణిగుడ ఫారంలో అమ్మవారి పూజల్లో భాగంగా దీపాలంకరణ ఆకర్షించింది. అదేవిధంగా ఎరుపురంగు గల ఢలియాలతో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రులు సందర్భంగా మజ్జిగౌరి అమ్మవారు సునాబేసొలు దర్శనం ఇస్తుండటంతో ఆదివారం తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో మందిరం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

● చండీ రూపంలో అమ్మవారు

● చండీ రూపంలో అమ్మవారు

● చండీ రూపంలో అమ్మవారు