
మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన
జయపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సారా దుకాణం పెట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆలిండియా ఎంఎస్‌ఎస్ (ఆలిఇండియా మహిళా సంస్కృతిక సంఘటన) బొయిపరిగుడ సమితి కమిటీ ఆందోళన చేపట్టింది. సారా దుకాణం ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ బొయిపరిగుడ బీడీవోకు వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు పెరిగాయని నినాదాలు చేశారు. కొరాపుట్ జిల్లా ఆలిండియా మహిళా సంస్కృతిక సంఘటన కార్యదర్శి లక్ష్మీ బారిక్ తదితరులు పాల్గొన్నారు.