
బాలల భవిష్యత్ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక తరం భవితవ్యాన్ని మార్చగలడన్నారు. లబ్బీపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్‌ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో డీఎస్సీలో టీచర్ పోస్టులు పొందిన వారికి మంగళవారం అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌కు వచ్చే పేద పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా, సేవగా భావించి అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్‌ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేషాద్రి నాయుడు, విత్తనాల వంశీకృష్ణ లకు రూ.50,000 చెక్ లను మంత్రి పార్థసారథి చేతుల మీదగా అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, కె.శ్రీనివాస్, సైకాలజిస్ట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా
చదివేది పేద పిల్లలే
రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ
మంత్రి కేపీ సారథి