
ఫెన్సింగ్ ఓవరాల్ చాంపియన్ వైవీఎస్‌ఆర్
మైలవరం: లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్శిటీ మెన్ అండ్ ఉమెన్ ఫెన్సింగ్ పోటీల్లో బాలికల చాంపియన్‌షిప్‌ను కై కలూరు వైవీఎస్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కై వసం చేసుకోగా బాలుర ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ను డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల పొందింది. అదే విధంగా నాలుగు గోల్డ్, మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్‌ను సాధించి కృష్ణా యూనివర్శిటీ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నే స్వామి బుధవారం తెలిపారు. మెరుగైన క్రీడాకారులను ఎంపిక చేసి కృష్ణా యూనివర్శిటీ జట్టు తయారు చేస్తామని చెప్పారు. కృష్ణా యూనివర్శిటీ జట్టు పంజాబ్‌లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీలో నిర్వహించే అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు పంపిస్తామని యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నవీన లావణ్య లతా తెలిపారు. కళాశాలలో చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళా రవి తెలిపారు. మూడు గోల్డ్ మెడల్స్‌తో ఉమన్ చాంపియన్‌షిప్ వైవీఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ సాదించింది. 2గోల్స్, 2సిల్వర్, ఒక బ్రాంజ్‌తో మెన్ చాంపియన్‌షిప్ ఎల్‌హెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదే విధంగా ఉమన్ 2సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్‌తో కలిపి మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది.
విద్యార్థికి అభినందనలు
కోనేరుసెంటర్: ఫెన్సింగ్ క్రీడలో బంగారు పతకం సాధించిన అలోషియాస్‌ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అభినందించారు. మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో బీఫార్మసీ విద్యార్థి అలోషియాస్ బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాంజీ బుధవారం తన చాంబర్‌లో విద్యా ర్థిని అభినందించారు. నవంబర్ 6 నుంచి అమృతసర్‌లోని గురునానక్ విశ్వవిద్యాలయంలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.