సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం

Oct 8 2025 8:07 AM | Updated on Oct 8 2025 8:07 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

కృష్ణలంక(విజయవాడతూర్పు): సనాతన ధర్మం పేరిట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని అంబేడ్కర్‌ స్మృతివనం వద్ద గిరిజన, దళిత, మైనారిటీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన ఘటన న్యాయవ్యవస్థ పైనే కాకుండా మొత్తం జాతి మీద జరిగిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement