బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంకటేశ్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంకటేశ్‌

Oct 7 2025 3:27 AM | Updated on Oct 7 2025 3:27 AM

బ్యాడ

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంక

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంకటేశ్‌ కొనసాగుతున్న నీటి విడుదల డిప్యూటీ సీఎంను కలిసిన అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ డీఎంఎల్‌టీ, డయాలసిస్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌నాగారం: ఈ నెల 6 నుంచి 19 వరకు అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే ప్రపంచ జూనియర్‌ బ్యా డ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా కామారెడ్డి జిల్లాకు చెందిన బల్ల వెంకటేశ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు బాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి కేవీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. పోటీల్లో 46 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. న్యాయనిర్ణేతగా ఎంపికై న బల్ల వెంకటేశ్‌ని జిల్లా అధ్యక్షుడు కర్నాటి వాసు అభినందించారు.

బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. లక్షా 11 వేల 500 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా, 26 గేట్ల ద్వారా లక్షా ఒ క్క వేయి 480 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తున్నారు. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 4 వే ల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు,మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

నిజామాబాద్‌నాగా రం: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను గ్రూప్‌–1 ఉద్యోగి ఆనంద్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఇటీవల గ్రూప్‌–1 ఫలితాల్లో నిజామాబాద్‌ జిల్లా ఆడిట్‌ కార్యాలయ అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా ఆనంద్‌ ఉద్యోగం సాధించిన విషయం తెలిసిందే.

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో పారామెడికల్‌ కోర్సులైన డీఎంఎల్‌టీ–30 సీట్లు, డయాలసిస్‌–10 సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌ కృష్ణమోహన్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి 28 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతితోపాటు ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌ చదివిన వారు అర్హులని, బైపీసీ చేసిన వారు లేకుంటే ఎంపీసీ చేసిన వారికి అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తు ఫారాలు మెడికల్‌ కళాశాల కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంక1
1/1

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు లైన్‌ జడ్జిగా వెంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement