
కనుల పండువగా శ్రీవారి రథోత్సవం
డిచ్‌పల్లి: మండలంలోని ఏడో బెటాలియన్ పరిధిలోగల శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారికి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామి వారి రథాన్ని కమాండెంట్ సత్యనారాయణ, అడిషనల్ కమాండెంట్ సాంబశివరావు స్వయంగా లాగారు. శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవిందా.. గోవిందా.. అంటూ భక్తుల నామస్మరణతో బెటాలియన్ మారుమోగింది. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షీరచంద్ర దర్శనం, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ భూదానకర్త కుమారులు ప్రమోద్ జాజు, వినోద్ జాజు కుటుంబసభ్యులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్లు కేపీశరత్‌కుమార్, కేపీ సత్యనారాయణ, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

కనుల పండువగా శ్రీవారి రథోత్సవం