
సమన్వయంతో వివాదాన్ని పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● సిద్దాపూర్ రిజర్వాయర్
నిర్మాణ పనుల పరిశీలన
వర్ని: సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద స్లూయిస్‌ల ని ర్మాణానికి అవసరమైన స్థలం విషయంలో రెవె న్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య నెలకొన్న వి వాదాన్ని పరస్పర సమన్వయంతో పరిష్కరించా లని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దాపూర్ రిజర్వాయర్ ని ర్మాణ పనులను, వివాదాస్పద స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. టోపో షీట్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా స్థల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులను ఆయన పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు అధికారులు చొరవచూపాలన్నా రు. ఈ విషయంలో జాప్యానికి తావివ్వొద్దన్నారు. స్లూయిస్‌ల నిర్మాణానికి అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామని స్పష్టం చేశారు. అప్పటిలోగా రిజర్వాయర్‌కు సంబంధించిన ఇతర పనులను వేగవంతంగా చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట్ జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇరిగేషన్ ఎఫ్‌డీవో సుధాకర్, తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు.