
బస్సును అడ్డుకున్న విద్యార్థులు
రెంజల్(బోధన్): నిర్ణీత సమయానికి బస్సులు రాక పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ విద్యార్థులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం సైతం నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్య క్తం చేశారు. బస్సు ఎదుట నిలబడి ధర్నా నిర్వహించగా, వారికి స్థానికులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లతో వాదనకు దిగారు. సమయానికి బస్సు రాకపోవడంతో కందకుర్తి నుంచి రెంజల్ ఆ దర్శ పాఠశాలతోపాటు వీరన్నగుట్ట, రెంజల్ హై స్కూల్ గ్రామాలకు వెళ్లే విద్యార్థులు తరగతులకు ఆలస్యంగా చేరుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు బస్సు ను కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో కండక్టర్, డ్రైవర్లు మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని మేనేజర్ చెప్పడంతో ఆందోళన విరమించారు.