
సేవలతోనే ప్రజల్లో గుర్తింపు
భిక్కనూరు: ప్రజలకు అందించే సేవలతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని సిద్ధరామేశ్వరాలయం పీఠాధిపతి సదాశివ మహంత్ శివాచార్య అన్నారు. మంగళవారం ఆయన మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న కుంట లింగారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా శివాచార్య మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవగా భావించాలన్నారు. కులమతాలకు అతీతంగా సేవలు అందించాలన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు యాదిరెడ్డి, ఏనుగు తిమ్మారెడ్డి, గణేష్‌రెడ్డి, పడమటి రవి, నాగార్తి మల్లేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): 70 ఏళ్లుగా శెట్పల్లి గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రాలేదని.. తమ గ్రామానికి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ పదవిని ఎస్సీలకు రిజర్వ్ చేయాలని కోరుతూ మంగళవారం అదనపు కలెక్టర్ చందర్‌నాయక్‌కు గ్రామ అంబేడ్కర్ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు ఉన్నా నేటికి రిజర్వేషన్ రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు తోట సాయిలు, పరంధాములు, మన్నె చిన్న బాలయ్య, శంకర్, రాజయ్య, సాయిలు, రాములు, సాయికుమార్ పాల్గొన్నారు.

సేవలతోనే ప్రజల్లో గుర్తింపు