
రోడ్డే చెరువై..
డొంకేశ్వర్ మండలంలోని అన్నారం–సిర్పూర్ రోడ్డు అధ్వానంగా మారింది. వర్షానికి భారీ గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షపు నీటికి గుంతలు ఏర్పడకపోవడంతో వాహనాలు అదుపుతప్పి కిందపడుతున్నారు. సోమవా రం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి గుంతలో పడ్డారు. స్థానికులు వచ్చి వారికి సాయం చేశారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని అన్నారం, సిర్పూర్ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
– డొంకేశ్వర్(ఆర్మూర్)