
కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్‌నాగారం: ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అథ్లెటిక్స్ ఫెస్టివల్ కరపత్రాలను సోమవారం రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ ఆవిష్కరించారు. జిల్లాలో ప్రతి ఏడాది నవంబర్ 8న స్వాతంత్య్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని టోర్నీ నిర్వహించనున్నారు. టోర్నీలో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సయ్యద్‌ఖైసర్ పాల్గొన్నారు.