
సోయాకు తీవ్ర నష్టం
మద్నూర్(జుక్కల్): మండలంలోని సోనాల, డోంగ్లీ మండలంలోని మొగా, లింబుర్ గ్రామ శివారులో భారీ వర్షం కురవడంతో రైతులు కోసి కుప్ప పెట్టిన సోయా పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు పేర్కొన్నారు. అలాగే కోతలు కాకుండా ఉన్న పంట అడ్డం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే వర్షాలు కురిస్తే వచ్చే నాలుగు గింజలు కూడా రావని అన్నదాతలు బాధపడుతున్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి, పంటను సాగు చేస్తే, పంట చేతికి వచ్చే సరికి వర్షం నష్టపరిచిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని సోయా రైతులు కోరుతున్నారు.