
తొలి గంట.. మోసానికి అడ్డుకట్ట
● నగరంలోని వినాయక్‌నగర్‌కి చెందిన ఓ వ్యక్తి బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో రూ.10,51,533 డబ్బులు కోల్పోగా, సైబర్ క్రైం పోలీసులు రూ.7,89,979 రికవరీ చేశారు.
● ఆర్మూర్ డివిజన్‌కి చెందిన ఓ వ్యక్తిని సైతం సైబర్ మోసగాళ్లు మభ్యపెట్టి బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట రూ.52,50,297 టోకరా వేశా రు. వెంటనే బాధితుడు పోలీసులను సంప్రదించడంతో రూ.27,25,725 రికవరీ చేశారు.
● నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించి రూ.30,81,000 ఆర్‌టీజీఎస్ ద్వారా లూటీ చేస్తే, రూ. 20,81,000 సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు.
ఖలీల్‌వాడి: సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జిల్లా ప్రజలను పోలీసు లు అప్రమత్తం చేస్తున్నా రు. ఆర్థికపరమైన నష్టా లు జరిగిన వెంటనే గ్ర హించి గంటలోపు ఫిర్యా దు చేస్తే జాతీయ సైబర్ క్రైం పోలీసులు నిందితు ల అకౌంట్‌లను ఫ్రీజ్ చేసి డబ్బులను రికవరీ చేసే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. జిల్లా పోలీసు సైబర్ ఆఫీస్‌కు నెల రోజులలో 8 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఎక్కువగా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్ పేరిట మోసాలు జరుగు తున్నట్లు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే వెంటనే డయల్ 1930 నెంబర్, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని, www. cybercrime. gov. in లాగిన్ అయి రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందంతో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్లను ఏర్పాటు చేసి సైబర్ మోసాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 33 సైబర్ క్రైం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. బాధితులు రూ.4,92,54,875 నష్టపోగా సైబర్‌క్రైమ్ పోలీసులు రూ.87,29,839 రికవరీ చేశారని తెలిపారు. సైబర్ మోసాలకు అ డ్డుకట్ట వేసేందుకు సైబర్‌క్రైమ్ ఏసీపీ వై. వెంకటేశ్వ రరావు, సీఐ మహమ్మద్ ముఖీద్‌్ పాషా, ఎస్సై ప్రవళిక, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శ్రీరామ్, సురేశ్, నాగభూషణం, నరేశ్, ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత, శృతి, రమ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు సైబర్ నేరగాళ్ల
బారినపడకుండా పోలీసుల చర్యలు
టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేస్తే మోసగాళ్ల అకౌంట్లు ఫ్రీజ్
జిల్లాలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 33 కేసులు నమోదు
మోసగాళ్ల చేతిలో రూ. 4.92 కోట్లు, రికవరీ రూ.87 లక్షలు
వెల్లడించిన సీపీ సాయిచైతన్య

తొలి గంట.. మోసానికి అడ్డుకట్ట