
‘సాగర్’ ఐదు గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 32,820 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు సోమవారం తెలిపారు. ఐదు గేట్లను ఎత్తి 32,820 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు(17.8టీఎంసీల) కాగా, 1405 అడుగుల(17.8 టీఎంసీల) పూర్తిస్థాయి మట్టంతో నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కౌలాస్‌లోకి 7,147 క్యూసెక్కులు..
కౌలాస్ ప్రాజెక్టులోకి 7,147 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఐదు గేట్ల ద్వారా 9,782 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.237టీఎంసీల)కు గాను 457.85 మీటర్లు(1.201టీంసీల) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.